హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : దాహమేసిన దుప్పి... స్విమ్మింగ్ పూల్‌లో దూకి...

అంతర్జాతీయం12:51 PM October 19, 2019

New Hampshire : అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌లో ఓ చిత్రం జరిగింది. ఏంటంటే... దాహం వేసిన ఓ దుప్పి... పక్కనే ఉన్న ఓ రిసార్టులోకి వెళ్లింది. అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో నీటిని చూసింది. అదేదో చెరువు అనుకొని... అందులో కాలు పెట్టింది... అంతే... స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. తీరా పడిన తర్వాత... బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు. అది చూసిన రిసార్ట్ నిర్వాహకులు దాని దగ్గరకు వెళ్దామంటే... కొమ్ములతో గుచ్చుతుందని భయపడ్డారు. ఆ పూల్‌కి ఓ వైపు మెట్లు ఉన్నాయి. దాన్ని అటుగా పంపితే... ఆ మెట్లు ఎక్కి ఎలాగొలా బయటకు వస్తుందని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం... దుప్పి వెనక నుంచీ ఇద్దరు వ్యక్తులు... ఓ తాడును పట్టుకొని... మెల్లగా దుప్పిని మెట్లవైపు నడిపించారు. అలా అది ఓ మెట్టు ఎక్కి... ఎలాగొలా బయటకు వచ్చింది. ఈ ఆపరేషన్ దాదాపు రెండు గంటలపాటూ సాగింది. మీకో దండంరా బాబూ అనుకుంటూ దుప్పి అక్కడి నుంచీ వెళ్లిపోయింది.

webtech_news18