తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కాసేపు పైలట్‌గా మారారు. శంషాబాద్‌లో విమానం నడిపి కొత్త అనుభూతి పొందారు. ప్రధాన పైలట్ సూచనలతో విమానం నడిపి.. గాల్లో చక్కర్లుకొట్టారు. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (FSTC)ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అనంతరం ఆయన కాసేపు విమానాన్ని నడిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.