హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

రైలు పైనుంచీ వెళ్లినా ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు

ఆంధ్రప్రదేశ్15:03 PM November 18, 2018

అనంతపురంలో ఓ ప్రయాణికుడు రైల్వే బ్రిడ్జి ఎక్కి, దిగే ఆసక్తి లేక, రైలు పట్టాల పైనుంచీ అవతలి ప్లాట్ ఫాంకి వెళ్లాలనుకున్నాడు. ఐతే, అవతలి ప్లాట్‌ఫాంపై ఓ గూడ్స్ రైలు ఆగివుంది. దాని కింది నుంచీ దూరి అవతలి ప్లాట్ ‌ఫాంకి వెళ్లాలనుకున్నాడు. అతను అలా కిందికి దూరగానే గూడ్స్ రైలు కదలడం మొదలైంది. అప్పటికప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని ప్రయాణికుడు, వెంటనే పట్టాలపై నిలువుగా పడుకున్నాడు. యధావిధిగా గూడ్స్ రైలు చకచకా వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసిన తోటి ప్రయాణికులు షాకయ్యారు. ఐదు నిమిషాలపాటూ అందరూ టెన్షన్ పడ్డారు. తీరా గూడ్స్ వెళ్లిపోయాక తాపీగా పట్టాలపై నుంచీ లేచాడు ప్రయాణికుడు. అతనికి ఏమీ కాలేదని తెలిసి, ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఇలాంటి పని చేసినందుకు నలుగురూ అతనికి చివాట్లు పెట్టారు. చక్కగా బ్రిడ్జి పైనుంచీ వెళ్లకుండా ఇలా ఎందుకు చేశావని మండిపడ్డారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading