హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్ బ్రూస్ కూడా ఆతనికి తలవంచాయి

అతని ఆశయం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నబోయింది. పేదరికాన్ని ఎదిరించి... కృషి, పట్టుదలతో ముందుకు సాగుతున్న ఆతను ఇప్పటికే... ఎవరెస్ట్, కిలిమంజారో.. ఎల్ బ్రూస్‌ని అధిరోంచి ముందుకు సాగుతున్నాడు. ఏడు ఖండాలలోని.. ఏడు శిఖరాలను అధిరోహించి భారత కీర్తిపతాకాన్ని ప్రపంచానికి తెలియజేయడమే అతని లక్ష్యం. అతనే నెల్లూరు జిల్లా పెనుబల్లికి చెందిన కె.సూర్యప్రకాష్. చిన్నప్పటి నుంచీ తమ గ్రామానికి దగ్గరలో ఉన్న కొండల్ని ఎక్కడం ద్వారా పర్వతారోహణపై సూర్యప్రకాష్‌కి ఆసక్తి కలిగింది. నెల్లూరు జిల్లాకే చెందిన ఎవరెస్టును మొదటిసారి అధిరోహించిన తెలుగువాడైన మల్లిమస్తాన్‌రావును చూసి సూర్యప్రకాష్ స్పూర్తిపొందాడు. ఏడు ఖండాలలో ఏడు శిఖరాల్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సూర్యప్రకాశ్ తండ్రి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి శేషమ్మ అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. చుట్టూ పేదరికం ఉన్నా కూడా సూర్యప్రకాష్... స్నేహితులు, దాతలు ఇచ్చిన సహకారంతో పర్వతారోహణలో ముందుకు సాగుతున్నాడు. సూర్యప్రకాష్ ఇప్పటి వరకూ ఆగస్టు 15-2017న ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని, మే 16-2018న ఆసియాలోని ఎవరెస్టు శిఖరాన్ని, జులై 6-2019న యూరప్‌లోని ఎల్ బ్రూస్ పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడానికి సూర్యప్రకాశ్‌కి ఏపీ ప్రభుత్వం సహకారం అందించింది. 2018లో యువజన సంక్షేమ శాఖ సహకారంతో కాశ్మీర్‌లోని పహల్గాంలో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించే బృందంలోకి సూర్యప్రకాష్ ఎంపికయ్యాడు. కాశ్మీర్‌లోని పహల్గాంలో శిక్షణా కేందంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని... ఎవరెస్టు శిఖరాన్ని మే6న చేరుకుని భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ప్రస్తుతం సూర్యప్రకాష్ ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దీంతోపాటు తనలాగా పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నాడు.

Krishna Kumar N