హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇదే.. కృత్రిమ కాళ్లతో మగ్గం నేస్తున్న యువకుడు..

ట్రెండింగ్12:51 PM February 20, 2020

రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న ఓ వ్యక్తి.. కృత్రిమ కాళ్లతో మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పోచంపల్లి మునిసిపాలిటీకి చెందిన గొట్టిముక్కుల రమేశ్ అనే యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ రోజు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి కాళ్లు పోగొట్టుకున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో రెండు కృత్రిమ కాళ్లను పొంది.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడి ఆత్మవిశ్వాసానికి స్థానికులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైన ఓ యువకుడికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు.

webtech_news18