అతడు రైలు లోకోపైలట్.. ముంబై లోకల్ ట్రైన్‌కు డ్రైవర్.. ఉల్లాస్‌నగర్ నుంచి ముంబై వైపు వెళ్లే రైలును నడుపుతున్నాడు.. అనుకోకుండా ప్రకృతి పిలిచింది.. మూత్రం పోయాల్సిన పరిస్థితి.. తాను ఆపుకోలేక, రైలును ఆపేసి.. ఇంజిన్ ముందుకు వెళ్లి పని కానిచ్చేశాడు. అయితే, ఆ దృశ్యాలను బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.