కర్నాటక లోలాసూర గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ అనే రైతులు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. ఐతే కరోనా వదంతుల కారణంగా చికెన్‌కు డిమాండ్ పడిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఓ వైపు డిమాండ్ లేకపోవడం.. మరోవైపు పోషణ ఖర్చు పెరగడంతో..తాను పెంచిన కోళ్లను సజీవంగా సమాధి చేశాడు. ప్రొక్లెయినర్‌తో భారీ గుంతతీసి, ఏకంగా ఆరువేళ్ల కోళ్లను అందులో పూడ్చిపెట్టాడు. రూ.6లక్షలు పెట్టి కోళ్లను పెంచానని..డిమాండ్ లేకున్నా వాటిని పోషిస్తే మరింత నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే వాటిని పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.