కీకీ చాలెంజ్ అంటే కదులుతున్న కారులో నుంచి బయటకు దూకి.. ఆ తర్వాత డ్యాన్స్ చేయడం. ఇలా చేస్తే కాళ్లు విరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, అది పెడచెవిన పెట్టేవారు కూడా ఉన్నారు. కానీ, కీకీ చాలెంజ్‌తో చక్రాల కుర్చీలో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ కాజల్ వెరైటీ డ్యాన్స్ చేశారు. కీకీ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని చక్రాల కుర్చీతో వారిద్దరూ చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.