హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఎలుగుబంటి వేషధారణలో పోలీసులు.. వైరల్ వీడియో

జాతీయం16:13 PM March 10, 2020

చిన్న పామును కొట్టాలన్నా... పెద్ద కర్రను వాడాలంటారు కదా... చిన్న చిన్న కోతుల్ని తరిమేందుకు ఏం చెయ్యాలో... ఉత్తరాఖండ్... మిర్తీలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారులకు అర్థం కాలేదు. రోజురోజుకూ కోతుల బెడద ఎక్కువైపోతోంది. టిఫిన్ తెచ్చుకుంటే... తినేస్తున్నాయి. భోజనం తెచ్చుకుంటే తినేస్తున్నాయి. కోతులకు భయపడి తెచ్చుకోవడమే మానేస్తున్నారు సైనికులు. ఇది గమనించిన అధికారులకు... ఎలుగుబంట్లంటే కోతులకు భయం అని ఎవరో చెప్పారు. అవునా... ఎలుగుబంట్లను చూస్తే కోతులు పారిపోతాయా అని ప్రశ్నించుకొని కన్ఫామ్ చేసుకున్నారు. మరైతే... కోతులు రాకుండా ఉండేందుకు... రెండు ఎలుగుబంట్లు తెద్దాం అనుకున్నారు. అందుకు అటవీ శాఖ అధికారులు అడ్డుపుల్ల వేశారు. కోతుల కోసం ఎలుగుబంట్లను వాడటానికి... వన్యప్రాణి చట్టాలు ఒప్పుకోవని చెప్పారు. "అవునా... ఇదొకటుందా... మరైతే ఏం చేద్దాం" అని ఆలోచిస్తుంటే... ఓ అధికారి బుర్రలో లైట్ వెలిగింది. "ఎలుగుబండ్లలాగా మనమే డ్రెస్ వేసుకుంటే..." అన్నారు. "అవునుగా... భలే చెప్పావ్... అలా చేద్దాం" అనుకున్నారు. ఇంకేముందు... రెండు ఎలుగుబంటి డ్రెస్‌లను తెప్పించి... సైనికులకు వేయించారు. ఇక వెళ్లండి... కోతులకు కనపడండి అన్నారు. వాళ్లు అలా వెళ్తుంటే... కోతులు వాళ్లను చూసి... "వామ్మో ఎలుగుబంట్లు... ఎంత పెద్దగున్నాయో చూడు... వాటికి గానీ దొరికితే... బండకేసి బట్టను కొట్టినట్లు... మనల్ని కొడతాయి" అనుకుంటూ పరుగో పరుగు. వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading