హైదరాబాద్ కి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇటీవల రెండు కొత్త ప్రపంచ రికార్డులు అందుకుంది. వెస్ట్ మారేడ్పల్లి గీతాంజలి హైస్కూల్లో ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ అనే అమెరికన్ సంస్థ నిర్వహించిన ప్రపంచ రికార్డ్ కార్యక్రమంలో పివి సహ్రుదా.. 20 నిమిషాల్లో 102 ఓరిగామి మోడళ్లను తయారు చేసింది.. అదే సమయంలో 350 సిరామిక్ టైల్స్ బద్దలు కొట్టింది. అంతకుముందు ఈ రికార్డు 262 పలకలను పగలగొట్టిన ఉత్తర కొరియాకు చెందిన ఆటగాడు పేరిట ఉంది.