సోషల్ మీడియా లో ఆదిపురుష్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ కృతి సనన్ బర్త్ డే సందర్బంగా హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ ఎదురు చూశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృతి సనన్ ఫస్ట్ లుక్ వార్తలు కేవలం పుకార్లు మాత్రమ అంటూ దర్శకుడు ఓమ్ రౌత్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.