కరోనా కారణంగా ఏది ముట్టుకోవాలన్నా జనం భయాందోళలకు గురవుతున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్ల నుంచి కూడా కరోనా సోకవచ్చని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో, కరెన్సీ ముట్టుకోవాలన్నా ఖంగారు పడుతున్నారు. అయితే నిత్యం క్యాష్, చెక్కులు, ఇతర అప్లికేషన్ ఫారంలతో గడిపే బ్యాంకు ఉద్యోగులు సైతం తమకు కరోనాతో ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా రాకుండా గుజరాత్‌కు చెందిన ఓ బ్యాంక్ అధికారి వినూత్న ప్రయోగం చేశాడు. తనకు కరోనా సోకకూడదని ఏకంగా చెక్కులను ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేసి కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ట్విటర్‌లో షేర్ చేశారు. సదరు అధికారి.. కస్టమర్ తెచ్చిన చెక్కును పట్టకారాతో అందుకున్నారు. ఆ తరువాత దాన్ని టేబుల్‌పై ఉంచి ఇస్త్రీ చేశారు. చేతులకు గౌవ్స్ ధరించి ఆయన ఇవ్వన్నీ చేశారు.