HOME » VIDEOS » Trending » GREEN CHALLENGE TRENDING SOCIAL MEDIA IN TELANGANA

Video: ‘గ్రీన్ ఛాలెంజ్’... ట్రెండింగ్ ఇన్ తెలంగాణ!

ట్రెండింగ్14:29 PM July 26, 2018

ఫిట్‌నెస్ ఛాలెంజ్ తరహాలో ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈ నెల 27న మాజీ రాష్ట్రపతి, దివంగత నేత అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా వినూత్నంగా హరితహారం చేపట్టేందుకు గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రవేశపెట్టారు. ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ కవిత, తన ఇంటి ముందు పెరట్లో మూడు మొక్కలు నాటారు. తర్వాత దర్శకుడు రాజమౌళి, సైనా నెహ్వాల్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎబీఎన్ ఛానెల్ అధినేత రాధాకృష్ణకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories