Tik Tok : షార్ట్ వీడియో మెసేజ్ యాప్ టిక్ టాక్ వచ్చాక... విద్యార్థులు మరింత చెడిపోతున్నారా? హైదరాబాద్... గాంధీ ఆస్పత్రిలో అధికారులు ఇద్దరు విద్యార్థులను తొలగించారు. వాళ్లు చేసిన తప్పేంటంటే విధుల్లో ఉంటూ టిక్ టాక్ వీడియోలు చేయటమే. సాధన కాలేజీకి చెందిన శ్యామ్ మిల్టన్, జెన్ కాలేజీకి చెందిన వీణ... టిక్ టాక్ వీడియోలు చేశారు. ఇంటెర్న్‌షిప్ కోసం గాంధీ ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. విధులు నేర్చుకోవాల్సిన వాళ్లు... అందులోనూ ఆస్పత్రిలో... అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఎవరు ఊరుకుంటారు. అందుకే సస్పెన్షన్ వేటు పడింది.