హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : కప్పలకు పెళ్లి... హనీమూన్... వానలు కురవాలని...

జాతీయం10:37 AM June 09, 2019

మొక్కలు, చెట్లూ పెంచితే వర్షాలు పడే అవకాశాలుంటాయి. కొంతమంది మాత్రం కప్పలకు పెళ్లి చేస్తే వానలు పడతాయని నమ్ముతారు. కర్ణాటకలోని ఉడుపి సిటిజెన్ ఫోరమ్ అదే నమ్మకంతో... కప్పలకు పెళ్లి చేశారు. ప్రస్తుతం ఉడుపిలో నీటి కొరత బాగా ఉంది. మండూక పరిణయంతో వాన దేవుడు కరుణించి వానలు కురిపిస్తాడని భావిస్తూ... రెండు వేర్వేరు గ్రామాల నుంచీ ఆడ, మగ కప్పలను తెచ్చి పెళ్లిచేశారు. కప్పలను వధూవరుల్లా అలంకరించడం ఈ పెళ్లిలో మరో ప్రత్యేకత. మగ కప్పకు వరుణ్ అనీ ఆడకప్పకు వర్ష అనీ పేరు పెట్టారు. వాటిని మనిపాల్ దగ్గర్లోని మన్నపల్లా ఏరియాకి హనీమూన్‌కి పంపించారు. ఇంక్రెడిబుల్ కదా.

Krishna Kumar N