సింగర్, తీన్మార్ మంగ్లీగా తెలుగు వాళ్లకు పరిచయమైన సత్యవతి రాథోడ్ కూడా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది మంగ్లీ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంగళవారం మణికొండలోని Ghmc పార్క్ లో మూడు మొక్కలు నాటిందామె. ఈ సందర్భంగా తాను మరో ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చాంది. జబర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో పాటు యాంకర్ శ్రీముఖి , జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ లను మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది.