హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: దూసుకొచ్చిన రైలు..పట్టాలపై పడుకున్న మహిళ

జాతీయం20:31 PM September 02, 2019

ఓ మహిళ రైల్వే పట్టాలను దాటుతోంది. అటు రైలు దూసుకొస్తోంది. స్థానికులు గట్టిగా అరవడంతో ఆమె కంగారు పడిపోయింది. వేగంగా పట్టాలు దాటే క్రమంలో కాలుజారి పట్టాలపైనే పడిపోయింది. క్షణాల్లోనే రైలు దూసుకొచ్చి ఆమె మీదుగా వెళ్లిపోయింది. అది గూడ్స్ ట్రైన్ కావడంతో భోగీలకు పట్టాలకు మధ్య గ్యాప్ చాలా ఉంటుంది. ఆ గ్యాప్‌లో తలదాచుకుంది మహిళ. పైకి లేస్తే ప్రాణాలు పోతాయని గ్రహించి అలాగే పడుకుంది. ట్రైన్ వెళ్లిపోయాక...బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడింది. ఆమె క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కర్నాటకలోని కలబురగి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18