హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేసి.. చిరుతను చంపేసిన కుక్కలు

జాతీయం05:50 PM IST Jun 13, 2019

చిరుత పులి.. కళ్ల ముందు కనిపిస్తే గుండె జల్లుమంటుంది. కాళ్లు, చేతులు గజ గజ వణుకుతాయి. ముచ్చెమటలు పడతాయి. పారిపోదామనుకుంటే.. మనకంటే ఫాస్ట్‌గా పరుగెత్తే ఆ మృగాన్ని చూసి అడుగు వేయాలంటే వంద సార్లు ఆలోచించాలి. ఎక్కడ దాడి చేసి చంపేస్తాయోనని, పీక్కు తింటాయోనని భయపడతాం. చిరుత కనిపిస్తే చాలు.. వేరే జంతువులు సైతం ఆమడ దూరం పారిపోతాయి. కానీ, ఓ చిరుతకు కుక్కులు చుక్కలు చూపించాయి. దాని చుట్టూ చేరి ఎటూ కదలనీయకుండా అరుపులతో దాన్ని బెంబేలెత్తిస్తూ.. ఒకదాని తర్వాత మరోటి దాన్ని కరవడం మొదలుపెట్టాయి. పారిపోయేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా దాన్ని వదలకుండా రక్తం కళ్ల జూశాయి. చివరికి ఎటూ కదల్లేక ప్రాణం విడిచిందా చిరుత. ఈ ఘటన కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti