హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఇంటి గార్డెన్‌లోకి వచ్చిన ఎలుగుబంటి... ఏం చేసిందంటే...

అంతర్జాతీయం13:39 PM July 12, 2019

అమెరికా... న్యూజెర్సీలో ఓ అడవికి దగ్గరగా ఉంది ఆ ఇల్లు. దాని ఓనర్ కావాలనే అలాంటి చోట ఇల్లు కట్టుకున్నాడు. అతనికి అడవులు, పచ్చటి చెట్లంటే ఇష్టం. ఇల్లు కట్టేటప్పుడే... ఇంజినీర్లు చెప్పారు... ప్రమాదం అని. అయినా వినిపించుకోలేదు. ఆ ఇంట్లోకి రెగ్యులర్‌గా పాములు, అడవి జంతువులు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ ఎలుగు బంటి... ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఆ టైంలో ఇంట్లో వాళ్లెవరూ బయటకు రాలేదు. వాళ్ల పనుల్లో వాళ్లున్నారు. ఆకలితో వచ్చిన ఆ ఎలుగు... అక్కడ ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వెతికింది. దానికి ఏమీ దొరకలేదు. ఇంతలో... అక్కడకు ఆ ఇంట్లో పెరిగే కుక్క వచ్చింది. ఎలుగును చూడగానే ఒక్కసారిగా ఉరికింది. అంతే... కుక్కను చూడగానే భయపడిన ఎలుగు... అడవిలోకి పారిపోయింది.

Krishna Kumar N