క్రికెటర్ రోహిత్ శర్మలో మనకు తెలియని టాలెంట్స్ ఎన్నో ఉన్నాయి. క్రీజులో బాల్ పడడమే తరువాయి బౌండరీకి తరలించే ఈ హిట్టర్... ఫోటోగ్రాఫర్‌గా మారి టీమ్ మేట్స్‌ను కెమెరాలో బంధించాడు. ప్రతీ సిరీస్‌కు ముందు ఆటగాళ్లతో తీసే ఫోటోషూట్‌లో పాల్గొన్న రో‘హిట్’... సెల్‌ఫోన్ కెమెరాతో ఫోటోలు తీశాడు. ఈ సమయంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లా మనీశ్ పాండేకు సూచనలు ఇచ్చాడు రోహిత్. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.