Trending News: ఆవు ఫుట్బాల్ ఆడింది..! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. నిజం. ఆవు నిజంగానే ఫుట్బాల్ ఆడింది. ఏదో బాల్ దగ్గర పెట్టుకొని అటూ ఇటూ కదిలించడం కాదండీ.. మైదానమంతా పరుగెడుతూ ప్రొఫెషనల్ ఆటను చూపించింది. ఫుట్బాల్ ఆటలో.. బాల్ తన వద్దే ఉంచుకోవడానికి ఆటగాళ్లు వేసే ఎత్తులు, కిక్ షాట్లు మనకు తెలిసిందే. అచ్చం ఫుట్బాల్ ప్లేయర్లను తలపించేలా.. బాల్ తన వద్దే ఉంచుకోవడానికి ఆవు చాలానే శ్రమించింది. ఈ ఘటన గోవాలో జరిగింది.