ఇంటర్ బోర్డులో అవకతవకలను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు బోర్డు ముట్టడికి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం భారీ సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు బోర్డు కార్యాలయం వద్దకు చేరుకోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.