వెర్రి వెయ్యి రకాలు అంటారు కదా. అందులో ఇదొకటి అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ ప్రబుద్ధుడు... అందరిలా కాకుండా... కారుపైకెక్కి కూర్చున్నాడు. ఎందుకూ అంటే అదో ఆనందం అన్నాడు. తింగరోడిలా ఉన్నాడు అనుకుంటూ... ఇతర వాహనదారులు తమదారిన తాము వెళ్లిపోయారు. ఇంతలో ఓ బైక్ అటుగా వచ్చింది. కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. బైక్ రైడర్లు కారు డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. తప్పు ఎవరిదైనా... వాళ్లు మాత్రం పైన మనిషిని కూర్చోబెట్టుకొని హైవేపై కారెలా డ్రైవ్ చేస్తావ్... ఈ రోడ్డేమైనా మీ బాబుదా అని ప్రశ్నించారు. దాంతో అవాక్కవడం కారు డ్రైవర్ వంతైంది.