హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మీ పిల్లలకు జాన్సన్స్ బేబీ పౌడర్ వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్

ట్రెండింగ్10:00 AM December 20, 2018

జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడీర్‌లో క్యాన్సర్ కారకాలు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని బద్ది ప్లాంట్‌ నుంచి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు శాంపిల్స్‌‌ను సేకరించారు. బేబీ పౌడర్‌లో వాడుతున్న ఆస్‌బెస్టాస్ వల్ల పిల్లలకు క్యాన్సర్ వస్తుందని కంపెనీకి కొన్ని దశాబ్దాలుగా తెలుసని, అయినా, కంపెనీ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదంటూ ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ అధికారులు శాంపిల్స్ సేకరించారన్న కథనంపై ఇంతవరకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే, గత శుక్రవారం రాయిటర్స్‌లో వచ్చిన కథనాన్ని మాత్రం ఖండించింది. ‘అది కేవలం ఏకపక్షం. అబద్ధం. రెచ్చగొట్టేలా ఉంది.’ అని ప్రకటన విడుదల చేసింది.

Krishna Kumar N