Hyderabad | Viral Video : హైదరాబాద్... చైతన్యపురి పరిధిలోని గణేష్‌పురి కాలనీలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. కాలనీ రోడ్డు మీద వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే నిలిపి ఉంచిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కార్లు, బైకులూ ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టమూ జరగకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే... ఓ చిన్నారి తృటిలో తప్పించుకోవడంతో అందరూ ఆ చిన్నారిని మెచ్చుకుంటున్నారు. అసలేం జరిగిందంటే... భవన నిర్మాణ వ్యర్థాలతో వెళ్తున్న ట్రాక్టర్.. గణేష్‌పురి కాలనీలోంచీ వెళ్తుండగా డ్రైవర్‌కి ఫిట్స్ వచ్చినట్లు తెలిసింది. దాంతో ఆయన ట్రాక్టర్ పై నుంచీ జారి ఓ ఇంటి వరండాపై పడ్డాడు. అంతే ట్రాక్టర్ దానంతట అదే ఇష్టమొచ్చినట్లు దూసుకెళ్లింది. రోడ్డుపై నిలిపి ఉన్న కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో మరో వ్యక్తి ట్రాక్టర్పైనే ఉండిపోయాడు. ఇలా కొంతదూరం దూసుకెళ్లిన ట్రాక్టర్... ఓ కారును ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా... 2 కార్లు, 5 బైకులు ధ్వంసమయ్యాయి. డ్రైవర్‌కు ఫిట్స్ రావడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నారు.