హీరోయిన్లకు తెరపై ఎంత హాట్‌గా కనిపించినా... సక్సెస్ దక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందాల భామ అదితిరావు హైదరీకి ఆ లక్ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అందుకే ఈ భామకు హిట్స్‌తో పాటు అవకాశాలు కూడా రావడం లేదు. అయితే తాజాగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించే సినిమాలో శర్వానంద్ సరసన అదితిరావు హైదరీకి ఛాన్స్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాలో సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికీ చివరికి అదితి వైపే చిత్రబృందం ఫిక్స్ అయ్యయిందని తెలుస్తుంది. అయితే తెలుగులో అదితికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని... ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఆమెకు మళ్లీ అవకాశాలు రాకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.