హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న భైరవకోన... ఎక్కడుంది? ఏంటి దాని ప్రత్యేకత?

Bhairava Kona : ఎతైనకొండలు.. ఎటు చూసినా పచ్చదనం... ఒంపులు తిరిగిన వాలు లోయలు.. గలగలా పారే జలపాతాలు... ఒక్కచోటే ఉంటే ఏమనిపిస్తుంది. అలాంటి చోట ఒక్కరోజైనా గడపాలని అనిపిస్తుంది. వీటన్నింటికీ తోడు... పల్లవుల శిల్పకళా నైపుణ్యం. చరిత్రకు అందని ఎన్నో రహస్యాలతో కూడిన శివాలయం కూడా ఉంటే అలాంటి ప్రదేశంలో విహరించకుండా ఉండగలమా..? ప్రకాశం జిల్లాలోని భైరవకోన ప్రాంతమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కార్తీక మాసంలో అక్కడి అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఆకాశానంటే బ్రహ్మ, రుద్ర, విష్ణు కొండల మధ్యలో వున్న ప్రదేశమే భైరవ కోన. ప్రకృతి ఒడిలో పరవసించి పోయే విధంగా వున్న ఈ ప్రదేశంలో దైవ సన్నిధానం, ప్రకృతి ఏర్పరచిన జలపాతం వుండటంతో భక్తులు ఇక్కడికి రావడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. పూర్వం భైరవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడనీ... అందుకే ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు స్థిర పడిందని చెపుతారు. భైరవుడు బాలుడనీ... అతని కోసం దుర్గాదేవి ఇక్కడకు వచ్చిందని ప్రతీతి. భార్గవమణి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల పరమశివుడే ఇక్కడ భార్గేశ్వరుడిగా వెలిశాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒకే కొండపై ఎనిమిది ఆలయాలు నిర్మించారు. వాటిలో శిల్పకళా నైపుణ్యం అలనాటి కళలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. దుర్గమ్మ భక్తులు ఇక్కడ 120 ఆలయాల్ని నిర్మించారనీ, వాటిలో కోటి లింగాల్ని ప్రతిష్ఠించాని చరిత్ర చెబుతోంది. ఈ కొండలనుంచీ జాలువారే జలపాతాలు అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి. చిన్నా పెద్దా అందరూ ఈ జలపాతాల్ని చూసి తరించాల్సిందే... ఒక వైపు దేవాలయాలు, మరోవైపు నీటిప్రవాహాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంటే ఆశ్చర్యం అక్కర్లేదు. భైరవకోనలో 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం ఉంది. ఇది పల్లవుల కాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు. ఈ గుహలోని రహస్య ప్రాంతాలలో నాగ సాధువులు వచ్చి కార్తీకమాసంలో ధ్యానం చేస్తారు. సామాన్యులకు వారిని దర్శించడం అసాధ్యం. భైరవకోన 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆ రోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవుల శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కిఉన్నాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. వీటిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి భక్తితో పూజిస్తున్నారు. కొండలలోంచి జారువారుతున్న జలపాతంలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఈ జలపాతంలో స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు తెలిపారు. ఏటా ఇక్కడికి వస్తుంటామని ఈ జలపాతంలో తడవటం తమకెంతో ఇష్టమని పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. రాత్రి సమయంలో ఇక్కడ బస చేయడానికి ఎలాంటి ఏర్పాట్లూ అందుబాటులో లేవు. రవాణా సదుపాయాలు అభివృద్ధి చేస్తే భైరవకోన మరో శ్రీశైలంగా రూపుదిద్దుకుంటుంది.

Krishna Kumar N