ఈ వీడియో చూసిన వాళ్లు... జింక పిల్ల సరదాగా చిరుతతో ఆడుకుంటోందని అనుకుంటారు. అసలు నిజం అది కాదు. ఆ జింక పిల్లను ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన చిరుత... దాన్ని తన పక్కనే పెట్టుకుంది. చిరుత నుంచీ తప్పించుకోవడమెలాగో తెలియక ఆ జింక పిల్ల... చిరుతను ఢీకొట్టి... దాన్ని కింద పడేసి... పారిపోదామని అనుకుంటూ... గంట 40 నిమిషాలు ఇలాగే ప్రయత్నించింది. రాత్రి కాగానే... జింక పిల్లను నోట కరచుకొని పట్టుకుపోయింది ఆ చిరుత. ఇదంతా జరిగింది దక్షిణ ఆఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో. సఫారీ గైడ్ యాండ్రీ ఫౌరీ ఇదంతా షూట్ చేశాడు.