హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మీకు దండం పెడతా.. అంబులెన్స్‌కు దారి ఇవ్వండి ప్లీజ్ అంటూ..

జాతీయం15:04 PM May 10, 2019

కుయ్.. కుయ్.. మంటూ అంబులెన్స్‌ వస్తుంటే పక్కకు తప్పుకొని దారి ఇస్తాం.. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కువ వాహనాలు ఉంటే అవి పక్కకు వెళ్లవులే అనుకొని నిస్సహాయత వ్యక్తం చేస్తాం. కానీ, ఓ యువకుడు గొప్ప మానవతాదృక్పదాన్ని చూపాడు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడమే కాదు, ఇచ్చేలా చేయడం కూడా! అని సందేశం ఇచ్చాడు. అసోంలోని గువహటికి చెందిన రిపుంజయ్ గొగోయ్ సాయంత్రం పూట సైకిల్‌పై వెళ్తుండగా అటుగా అంబులెన్స్ వాహనం ఎమర్జెన్సీ సైరన్ వేసుకొని వచ్చింది. అయితే, భారీగా ట్రాఫిక్ ఉండటంతో ఎవరూ సైడ్ ఇవ్వలేదు. అది గ్రహించిన గొగోయ్.. ప్రతి వాహనం వద్దకు వెళ్లి.. దయచేసి అంబులెన్స్‌కు దారివ్వండి అంటూ విజ్ఞప్తి చేశాడు. అంబులెన్స్ కంటే స్పీడుగా సైకిల్ నడిపి ప్రతీ వాహనం పక్కకు జరిగేలా చేశాడు. ఇది చూసిన అంబులెన్స్‌లోని వ్యక్తి అతడ్ని వీడియో తీశాడు. ఆ వీడియోలో గొగోయ్‌ని ఆ డ్రైవర్ ‘గుడ్ బాయ్’ అని ప్రశంసించడం వినిపించింది. అంబులెన్స్ ఆస్పత్రికి చేరేవరకు తానే దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేశాడు గొగోయ్. వీడియో తీసిన వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో గొగోయ్ హీరో అయిపోయాడు. అయితే, ఆ వీడియో తీసిన విషయం తనకు తెలీదని, ఆ క్షణంలో ప్రాణాలు కాపాడేందుకు తన వంతు సహాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఢిల్లీలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న గొగోయ్.. అంబులెన్స్‌కు దారి ఇచ్చి ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చాడు. వీలైతే ఆ వాహనానికి దారి ఇచ్చేలా తమ వంతు ప్రయత్నం చేయాలని విన్నవించాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading