హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: అర్జున అవార్డ్ గ్రహీత సిక్కిరెడ్డికి స్వగ్రామంలో ఘన స్వాగతం...

క్రీడలు16:20 PM October 08, 2018

ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకున్న తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ నేలకుర్తి సిక్కిరెడ్డి... చాలారోజుల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది. మహాబూబాబాద్ జిల్లాలోని స్వగ్రామం జయపురం చేరుకున్న సిక్కిరెడ్డికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలతో ముందు నడవగా...యువకులు త్రివర్ణ పతకాన్ని సగర్వంగా ఎగురవేస్తూ హంగామా చేశారు. సిక్కిరెడ్డిపై బంతిపూల వర్షం కురిపించిన గ్రామస్థులు... డప్పు దరువుల మధ్య తన ఊరి ఆడపడుచుకు ఆత్మీయ స్వాగతం తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించి రికార్డు క్రియేట్ చేసిన సిక్కిరెడ్డి... తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఈ వీడియోలను పోస్ట్ చేసింది.

Chinthakindhi.Ramu