హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : అమెరికా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి.. ప్రేమ వివాహం

ట్రెండింగ్16:19 PM March 13, 2020

ప్రేమకు కులమతాలతో సంబంధం లేదు. శత్రుదేశమా మిత్రదేశమా అని చూడదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారా.. రెండు మనసులు కలిశాయా అన్నది చాలు.. ఇరు వైపులా పెద్దవారు తమ పిల్లల అభిప్రాయాలను అంగీకరిస్తే అది వివాహ బంధానికి దారితీస్తుంది. సరిగ్గా అలాంటి ప్రేమ పెళ్లే గురువారం నిజామాబాద్ జిల్లాలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఖండాంతరాలు దాటిన ఈ ప్రేమ పెళ్లిదాకా వ‌చ్చింది.. నిజామాబాద్ జిల్లాకు చెందిన సామలేటి అర్చన కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. చదువు పూర్తయ్యాక అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అదే కంపెనీలో పనిచేస్తున్న శాన్ విన్ డ్యాగ్ అనే అమెరికా పౌరుడిని ఇష్ట పడింది. ఇరువురివి వేర్వేరు దేశాలు, వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన వారు. అయినా తమ ప్రేమను ధైర్యంగా పెద్దవాళ్లకు వ్యక్తపరిచారు. పిల్లల ఇష్టాలను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అది కాస్త పెళ్లి పీటలెక్కింది. నిజామాబాద్ లో హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేడుకల్లో అబ్బాయి తల్లిదండ్రులు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించి ఆ వేడుకకే హైలేట్ గా నిలిచారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading