గుజరాత్... అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. ఓ యువతి... ఫోన్లో వాట్సాప్ మెసేజ్‌లు చూసుకుంటూ... రైల్వే స్టేషన్లో నడుస్తోంది. నిజానికి ఆమె ఎక్కాల్సింది పక్కన బయలుదేరిన ట్రైనే. వాట్సాప్ మెసేజ్‌లలో పడి ఆ విషయం మర్చిపోయింది. మొబైల్ నుంచీ ఒక్కసారి దృష్టి పక్కకు వెళ్లగానే... అసలు విషయం గుర్తొచ్చింది. తాను ఎక్కాల్సిన ట్రైన్ ఆల్రెడీ బయలుదేరిందని అర్థమైంది. వెంటనే కంగారుగా ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడింది. కొద్దీలో పట్టాల్లోకి వెళ్లిపోయేదే. అక్కడి పోలీసులు, ఇతర ప్రయాణికులు... సరైన టైంలో ఆమెను కాపాడటంతో... ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.