అమెరికా రాష్ట్రం ఇండియానాలో... ఇండియానాపోలీస్ ప్రాంతంలో... జెట్ ఫ్యూయల్‌ను మోసుకెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి... బోల్తాకొట్టింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ట్రక్ డ్రైవర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిచిపోయాయి.