గుంటూరు జిల్లా... నిజాంపట్నంలో జరిగిన దారుణం ఇది. అక్కడి ఓ పెట్రోల్ బంకులో పోలీస్ వెహికిల్‌కి ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకున్నాడు ఇన్స్పెక్టర్. అందుకు డబ్బులు అడిగితే... తనను మనీ అడుగుతావా అంటూ బంక్ సిబ్బంది, మేనేజర్‌పై దాడికి దిగాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే... రాక్షసుల్లా తయారవుతుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇలాంటి దారుణాలు జరిగితే తన దృష్టికి తేవాలనీ, అలా తెచ్చేవారికి నజరానా ఇస్తానని సీఎం జగన్ మొన్ననే ప్రకటించారు. ఇప్పుడా ఇన్స్పెక్టర్పై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.