కర్ణాటక... చిత్రదుర్గలోని హిందసాగట్టి గ్రామంలోని రైతు ప్రదీప్ గురించి మనం తెలుసుకోవాల్సిందే. ప్రదీప్ తన పొలంలో పాప్ సింగర్ జస్టిన్ బీబెర్ సాంగ్స్ పాడుతూ... మైకెల్ జాక్సన్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. నిజానికి అతనికి ఇంగ్లీష్ రాదు అయినప్పటికీ జస్టిన్ బీబెర్లా పాడుతుండటం, మైకెల్ జాక్సన్‌లా స్టెప్స్ వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రదీప్... ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం... తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రదీప్‌ని మెచ్చుకున్నాడు.