బైక్పై గరిష్ఠంగా ముగ్గురు కూర్చోవచ్చు. కాస్త రిస్క్ చేస్తే అతి కష్టం మీద నలుగురిని కూర్చోబెట్టవచ్చు. కానీ ఈ బైక్పై ఏకంగా ఏడు మంది ప్రయాణించారు. భార్యాభర్తలతో పాటు నలుగురు చిన్నారులు బైక్పై ఉన్నారు. వారితో పాటు కోళ్లు, కుక్కలు కూడా ఉన్నాయి. అంతేకాదు అందులోనే లగేజ్ సైతం తీసుకెళ్లారు. ఇలా చేేయడం ప్రమాదకరమైని తెలిసినా..అందరూ కుటుంబ సమేతంగా బైక్పై వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.