పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సుల్తానాబాద్ మండలం గాంధీనగర్ లో సంక్రాంతి పండగ సంధర్భంగా బోగి కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గోన్నారు. గ్రామీణ వాతావరరణం ఉట్టిపడేవిధంగా అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి అందులో చెరుకుగడలను వుంచి, కోలాటంతో భజనలు చేస్తూ ప్రదక్షణలు నిర్వహించారు. ఉదయమే భోగిమంటలు ఏర్పాటు చేశారు.