హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో జరిగిందీ చిత్రమైన ఘటన. ఆదివారం బోనాల ఊరేగింపులో... పోలీసులు ఆన్ డ్యూటీ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి గొడవలూ జరగకుండా అంతా ప్రశాంతంగా సాగుతుందిలే అనుకున్నారు. ఇంతలో ఆ ఎస్సైకి చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు... ఎస్సైని కౌగలించుకొని... కిస్ చేశాడు. దానికి ఎస్సైతోపాటూ... అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత ఆ యువకుడికి జరగాల్సిన కార్యక్రమం జరిగిందనుకోండి... అది వేరే విషయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.