యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 15 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు స్వామి అమ్మవార్లకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.