మంచి ఉద్దేశంతోనే చేపట్టిన ఉమెన్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి ఆదిలోనే అవాంతరాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో పెట్రోలింగ్ కోసం లేడీ కానిస్టేబుల్స్‌కు హీరో గ్లామర్ బైక్స్ అందించారు. ఐతే వాటి హైట్ ఎక్కువగా ఉండడంతో మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. బైక్‌పై ఎక్కినప్పుడు భూమికి కాళ్లు అందక..అటూ ఇటూ తూలుతున్నారు. బ్యాలెన్స్ అదుపుతప్పి..ప్రమాదాలు జరిగే అవకాశముందని భయపడుతున్నారు. ఈ క్రమంలో తక్కువ హైట్ ఉండే బైకులు గానీ...లేదంటే స్కూటీలు ఇవ్వాలని కోరుతున్నారు.