నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గోప్యనాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని చిన్యతండా లో వివాహిత సుజాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అత్తింటి వారే చంపారని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. అబ్బాయి ఇంటిపై దాడి చేసి, ఆపై నిప్పు పెట్టిరు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.