హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆదిలాబాద్‌లో అధ్వాన్న రోడ్లతో అవస్థలు... ఇంట్లోనే ప్రసవించిన మహిళ...

తెలంగాణ13:37 PM July 04, 2019

Adilabad : ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం... లొద్దిగూడకు చెందిన గర్భిణీ జంగుబాయి... ఆస్పత్రికి చేరుకోలేక... ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. జంగుబాయి పురిటి నొప్పులతో బాధపడుతుంటే... ఆమె భర్త అంబులెన్స్‌కి కాల్ చేశాడు. ఐతే... సరైన రోడ్డు లేకపోవడంతో... అంబులెన్స్ సగం దాకా వచ్చి ఆగిపోయింది. దాన్లోంచీ కిందకు దిగిన వైద్య సిబ్బంది... నడుచుకుంటూ జంగుబాయి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్లంతా అప్పటికప్పుడు ట్రీట్‌మెంట్ చేసి... ఇంట్లోనే డెలివరీ చేయించారు. జంగూబాయి... ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను ఎడ్లబండిపై మూడు కిలోమీటర్ల దాకా తీసుకొచ్చి, అక్కడి నుంచీ ఆమెను బిడ్డతో సహా అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.

Krishna Kumar N