కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వానికి.. ప్రత్యక్ష ఉదాహరణ ఇది. హైదరాబాద్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్దానగర్లో లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందుకోసం గుంతలు తవ్వారు. ఐతే గురువారం కురిసిన భారీ వర్షానికి ఆ గుంత నీండిపోయింది. అదే సమయంలో ఓ మహిళ 2నెలల పాపను ఎత్తుకొని అటు వైపు వచ్చింది. అక్కడ గుంత ఉన్న విషయం తెలియక..అడుగు ముందుకేయంతో ఆమె నీటిగుంతలో పడిపోయింది. ఆ పపిసాప కూడా నీటి పడింది. స్థానికులు గమనించి వెంటనే వారిని రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.