కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో జనసంచారం లేక అడవి జంతువుల రోడ్లపైకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రోడ్డులో జనసంచారం లేకపోవడంతో అటవీ ప్రాంతం నుంచి దుప్పులు రోడ్లపైకి తరచూ వస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు వాటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.