హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కంటిలో కారం కొట్టి .. భర్తను నరికి చంపిన భార్య

తెలంగాణ19:21 PM October 11, 2019

మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ తన భర్తనే అతికిరాతకంగా పొడిచి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ కు చెందిన కొయ్యడ చంద్రయ్య, సింగరేణి కార్మికుడు కాగా, రోజు మద్యం సేవిస్తూ భార్య, పిల్లలను చిత్రహింసలకు గురి చేసే వాడని భార్య భాగ్యమ్మ పేర్కొంది. వీరికి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు. భర్త చంద్రయ్య వేధింపులు తాళలేక భార్య భాగ్యమ్మ కత్తితో పొడిచి భర్తను హతమార్చినట్లు పోలీసుల ముందు పేర్కొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భాగ్యమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

webtech_news18