HOME » VIDEOS » Telangana

Video : హిందుగాళ్లు బొందుగాళ్లు అన్న కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు : బానావత్ లక్ష్మి

తెలంగాణ09:06 AM September 12, 2019

సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం భూపతిపూర్‌కి చెందిన బానావత్ లక్ష్మీ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.కేసీఆర్‌ను దూషించినందుకు తనను అరెస్ట్ చేశారని.. మరి హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్న కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయరని ఆమె ప్రశ్నించారు.మహిళను అని కూడా చూడకుండా.. అరెస్ట్ చేసి ఆరు గంటలు అదుపులో ఉంచుకున్నారని అన్నారు. యూరియా దొరక్క రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..అందుకే ఆవేశంలో కేసీఆర్‌ను తిట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఓవైపు అప్పులు,మరోవైపు ఎరువులు.. ఈ బాధలు భరించలేకనే రోడ్డెక్కి ధర్నా చేశామన్నారు.భూపతిపూర్ వాసులం ఎరువుల కోసం రామాస్‌పేట వెళ్తే.. రాయికల్ వెళ్లామన్నారని.. రాయికల్ వెళ్తే.. భూపతిపూర్‌ సొసైటీలోనే తీసుకోవాలన్నారని లక్ష్మీ చెప్పారు. ఎరువుల దొరకని కారణంగానే ధర్నా చేశామని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు.ఎరువులు దొరక్క.. పంటలు పండక.. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు.

webtech_news18

Top Stories