HOME » VIDEOS » Telangana

Video : అడుగంటిన భూగర్భ జలాలు... పెరిగిన నీటి కష్టాలు...

తెలంగాణ15:07 PM May 08, 2019

నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకూ ప్రజల నీటి కష్టాలు పెరుగుతున్నాయి. పెరిగిన ఎండలకు తోడు... భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతుండటంతో ప్రజలు నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందుబాటులోకి వచ్చినా అది పూర్తి అవసరాలు తీర్చేందుకు చాలట్లేదు. జిల్లాలోని ఇందల్వాయి మండలంలో గుట్ట కింది తండా, మెగ్యానాయక్ తండా, చంద్రాయణపల్లి, గౌరారం, డొంకల్ తదితర గ్రామాల్లో ప్రజలు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories