Telangana Panchayat Elections : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 279 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొదటి, రెండో విడతల లాగానే మూడో దశ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. చలిని లెక్క చెయ్యకుండా ఉదయం నుంచే ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. జిల్లాలోని 25 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. డిచ్ పల్లి మండలం ధర్మారం జడ్పి హై స్కూల్లో ఏర్పాటుచేసిన 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్... పోలింగ్ ఏజెంట్లు జారీ చేసిన గుర్తింపు కార్డు పెట్టుకోవాలని ఆర్.ఓను ఆదేశించారు.