హైదరాబాద్‌లో వైరల్ జ్వరాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి రోగులు తరలివస్తున్నారు. రోగులు, వారి బంధువులతో ఆస్పత్రి కిటకిటలాడిపోతోంది. రోగులు, వారి బంధువులు కనీసం కూర్చోడానికి కూడా స్థలం లేక ఆరు బయట గడ్డిలో సేదతీరుతున్నారు