తెలంగాణా లోని సిరిసిల్ల జిల్లా లో కలెక్టర్ కృష్ణ భాస్కర్ రోజూ రోజుకు పెరుగుతున్న కరోన మహమ్మారి వైరస్ పై ఓ వినూత్న అవగహన సదస్సును నిర్వహించారు. తంగాలపల్లి మండలం కు చెందిన ఒగ్గుకళకారుడు దేవయ్య కళా బృందంతో కరోన వైరస్ గురించి చక్కగా ఒగ్గుకత రూపంలో అందరికి అర్ధమయ్యే రీతిలో కరోన వైరస్ పై గానఁచేసారు. ఇలా అయినా పల్లెలో ప్రజలకు చైతన్యం రావాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు.